: ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్...మెగా బ్రదర్స్ ఆలింగనం!
‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కొన్ని నిమిషాల క్రితం చేరుకున్నారు. ఆయనకు ఘనస్వాగతం లభించింది. అందరినీ విష్ చేసుకుంటూ వచ్చిన చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. ‘మెగా’ బ్రదర్స్ పక్కపక్కనే కూర్చున్న దృశ్యం అభిమానులకు కన్నుల పండువగా మారింది. కాగా, హాస్యనటుడు అలీ పోలీసు గెటప్ లో వచ్చి స్టేజ్ పై హల్ చల్ చేశాడు.