: మీడియా ముందుకు విద్యార్థి అభయ్ హత్య కేసు నిందితులు
హైదరాబాదులో పదవ తరగతి విద్యార్థి అభయ్ కిడ్నాప్, హత్య కేసులో నిందితులను మీడియా ముందుకు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసులో కారు డ్రైవర్ లలన్ తివారి, సాయితో పాటు మరొక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురుని ఈ రోజు మీడియా ముందుకు తీసుకువచ్చారు. డబ్బు కోసమే అభయ్ ను కిడ్నాప్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మహేందర్ రెడ్డి వివరించారు. ఈ నెల 16వ తేదీన జరిగిన అభయ్ మదానీ మర్డర్ చాలా దురదృష్టకరమైన సంఘటన అనీ, ఒక అమాయకుడిని కిడ్నాప్ చేసి చంపడం దారుణమని అన్నారు. ఈ కేసులో ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శేషుకుమార్ అలియాస్ సాయి, అతని సహాయకులు రవి, మోహన్ కలసి ముందస్తు ప్రణాళికతో ఈ కిడ్నాప్, హత్య చేశారని చెప్పారు.