: దర్శకుడు వర్మపై నా నమ్మకం చెక్కుచెదరదు: నటుడు వివేక్ ఒబెరాయ్


దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఎన్ని పుకార్లు వచ్చినా, ఆయనపై తనకున్న నమ్మకం చెక్కుచెదరదని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అన్నాడు. వర్మ ‘కంపెనీ’ చిత్రంతో బాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన వివేక్ ఒబెరాయ్, దాని సీక్వెల్ లోనూ ఇప్పుడు నటించనున్నాడు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, గ్యాంగ్ స్టర్, అండర్ వరల్డ్ డాన్ లాంటి నేపథ్యం ఉన్న సినిమాల చిత్రీకరణలో వర్మ నంబర్ వన్ అని అన్నాడు. కాగా, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చేసిన దందాల నేపథ్యంలో ‘కంపెనీ’ సినిమాను తెరకెక్కించారు. పరిటాల రవి హత్య నేపథ్యంలో నిర్మించిన 'రక్త చరిత్ర' సినిమాలో పరిటాల పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించాడు. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News