: ధోనీ భార్య సాక్షికి కోపం వచ్చిన వేళ!


నిన్న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టీ-20 పోరులో పాకిస్థాన్ పై టీమిండియా విజయం సాధించిన వేళ, అభిమానుల అల్లరి ధోనీ సతీమణి సాక్షికి కోపం తెప్పించింది. రాంచీలోని ఇంట్లోనే ఉండి మ్యాచ్ తిలకించిన సాక్షి, అనంతరం అభిమానులు ఇంటి ముందు చేసిన హంగామా, కాల్చిన బాణసంచాతో కూతురు జీవాకు నిద్రాభంగమవుతుందని చిరుకోపాన్ని ప్రదర్శించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖతాలో పోస్టు పెడుతూ, "అందరూ చేరి నా చిన్నారిని నిద్రలేపేలా ఉన్నారు. భవిష్యత్తులో ఏదో ఒకరోజు ఈ మ్యాచ్ గురించి జీవాకు చెబుతాలెండి. ఇప్పుడు చిన్నపిల్ల కదా... ఏం జరుగుతుందో పాపకు తెలీదు కదా" అని ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News