: ఆయన 15 ఏళ్ల సీనియర్... ఇలా చేస్తారనుకోలేదు: జీవన్ రెడ్డిపై కేటీఆర్
మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, 15 ఏళ్ల అనుభవాన్ని కలిగుండి, మంత్రిగా కూడా పనిచేసిన జీవన్ రెడ్డి, ఇలా దురుసుగా ప్రవర్తిస్తారని అనుకోలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి మంత్రి పోచారం సీటు వద్దకు వచ్చి కాగితాలు విసిరి కొట్టగా ఆపై కేటీఆర్ మాట్లాడారు. జీవన్ రెడ్డి విచారం వ్యక్తం చేయాల్సిందేనని, ఆపైనే మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరారు. జీవన్ రెడ్డి తప్పు చేసినప్పటికీ, జానారెడ్డి కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి వుంటే చర్చించాలని, అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.