: బీజేపీని నడిపిస్తున్నది జాతీయతే: అరుణ్ జైట్లీ


భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్నది జాతీయతేనని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. వాక్ స్వాతంత్ర్యం, జాతీయతా రెండూ కలగలిసే వుంటాయని అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గం రెండు రోజుల సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎల్లప్పుడూ అనుకూలమేనని, అయితే, అది జాతీయతను, ఇతరుల విశ్వాసాలను కించపరిచేదిగా ఉండరాదని అన్నారు. గత ప్రభుత్వాలు అవసరం లేని చోట్ల పథకాలు చేపట్టాయని, తాము దాన్ని సవరిస్తున్నామని తెలిపారు. సుపరిపాలన, మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని వివరించారు. జేఎన్యూలో జాతి వ్యతిరేక వ్యాఖ్యలకు మైనారిటీ వర్గాలు మద్దతివ్వడం సరికాదని అన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యమైనంత మేరకు బీజేపీ ప్రాతినిధ్యాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News