: చెబితే నమ్మడం లేదని తండ్రి అఘాయిత్యాన్ని వీడియో తీయించిన యువతి!


కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడైతే... మనసులో బాధను తల్లితో పంచుకుంటే, ఆమె నమ్మకుంటే... ఇదే పరిస్థితి ఉత్తరప్రదేశ్ లోని జలావున్ జిల్లాలో ఓ యువతికి ఎదురైంది. తండ్రి తనపై అత్యాచారం చేస్తున్నాడని తల్లికి చెప్పుకుని భోరున విలపిస్తే, ఆమె నమ్మలేదు సరికదా, కూతురినే తిట్టి పోసింది. ఇక ఆమెకు సాక్ష్యం చూపాలని భావించి, ఆత్మగౌరవాన్నే పక్కన పెట్టింది. తండ్రి అత్యాచారాన్ని వీడియో తీయమని స్నేహితుడితో మొర పెట్టుకుంది. స్నేహితుడు తీసిన వీడియోను తల్లికి సాక్ష్యంగా చూపింది. ఇలాంటి తండ్రి ఎవరికీ ఉండకూడదని, బహిరంగంగా చంపేయాలని, సులభంగా చంపకుండా, బాధపడుతూ చంపాలని కన్నీళ్లతో కోరుతోంది. వీడియోను చూసిన పోలీసులు ఆ కామాంధుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ అమ్మాయికి ఇప్పుడు మహిళా సంఘాలు తోడుగా నిలిచాయి.

  • Loading...

More Telugu News