: క్రిస్ గేల్ ఏమని పొగిడాడో చెప్పుకుని సంబరపడుతున్న స్నేహా ఉల్లాల్!
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ తో కలసి డేటింగ్ చేసిన అందాల భామ స్నేహా ఉల్లాల్, గేల్ తనను పొగడ్తలతో ముంచెత్తాడని చెప్పుకుని మురిసిపోతోంది. తమ పరిచయం ఎలా జరిగిందన్న విషయాన్ని వివరిస్తూ, "ఓ ప్రైవేటు పార్టీలో ఇద్దరమూ కలిశాం. తనే నా వద్దకు వచ్చి మాట్లాడాడు. మేమిద్దరమూ ఫోన్ నంబర్లు మార్చుకున్నాం. ఆపై అప్పుడప్పుడూ మాట్లాడుకునే వాళ్లం. నన్ను మానవ రూపంలో ఉన్న బొమ్మ అని గేల్ అంటుండే వాడు. బాలీవుడ్ అంటే అతను చూపే అభిమానం చూసి ఆశ్చర్యపోయాను. అమితాబ్ బచ్చన్ ను కలిసేందుకు చావడానికైనా సిద్ధమనేంత అభిమాని. అతని డ్యాన్సులు, పాటలు పాడే విధానం నాకెంతో నచ్చాయి. ఎప్పుడూ నియంత్రణలో ఉంటాడు" అని చెబుతోంది స్నేహా ఉల్లాల్. ప్రస్తుతం టీ-20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా గేల్ ఇండియాలోనే ఉండగా, ఆయనతో కలసి వున్న స్నేహ ఫోటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.