: యూఎస్ ట్రయినర్ సాయంతో 70 కిలోలు తగ్గిన జూనియర్ అంబానీ


అనంత్ అంబానీ... వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు. ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ మ్యాచ్ లను ఆడేవేళ, వీఐపీ ఎన్ క్లోజర్ లో కనిపిస్తుంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. కొద్ది నెలల క్రితం వరకూ దాదాపు 140 కిలోలకు పైగా బరువుతో ఉన్న అనంత్, ఇప్పుడు 70 కిలోలకు తగ్గిపోయాడు. స్వతహాగా భక్తి పరుడైన అనంత్, సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించగా, అతన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అమెరికా నుంచి వచ్చిన స్పెషల్ ట్రయినర్ సలహాలు, శిక్షణ కారణంగా అనంత్ గణనీయంగా బరువును తగ్గాడని తెలుస్తోంది. జామ్ నగర్ లోని రిలయన్స్ రిఫైనరీలో నిత్యమూ పదుల కిలోమీటర్ల దూరం అనంత్ పరుగులు తీస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఫిట్ నెస్ పొంది మారిపోయిన అనంత్ తదుపరి ఐపీఎల్ సీజన్లో అందరికీ కొత్తగా కనిపించనున్నాడన్నమాట.

  • Loading...

More Telugu News