: బీజేపీతో జతకట్టం, కేంద్ర పదవులు పొందం: టీఆర్ఎస్


తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్రంలోని బీజేపీతో జతకట్టి, మంత్రివర్గంలో చేరనుందని వస్తున్న వార్తలను లోక్‌ సభలో టీఆర్‌ఎస్ పక్ష నాయకుడు, మహబూబ్‌ నగర్ ఎంపీ జితేందర్‌ రెడ్డి ఖండించారు. ఇదంతా ఊహాగానమేనని వెల్లడించిన ఆయన, తాము కేంద్రంలో చేరబోమని, మంత్రి పదవుల కన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపైనే తమ దృష్టి ఉందని వివరించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దుష్టశక్తులు కొన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఖమ్మంలో 27 నుంచి జరగనున్న తెరాస ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పేదల సంక్షేమమే ధ్యేయంగా సాగిందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News