: జైలుకెళ్లి ఛగన్ భుజబల్ ను కలిసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియ!


మనీ ల్యాండరింగ్ చట్టం కింద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజబల్ ను ఎన్సీపీ నేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే కలిశారు. 14 రోజుల రిమాండులో భాగంగా ముంబైలోని ఆర్థర్ రోడ్ సెంట్రల్ జైలులో ఆయన ఉండగా, జైలుకు వెళ్లిన సుప్రియ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె, హోలీ శుభాకాంక్షలు చెప్పేందుకే ఆయన్ను కలిశానని, అంతకుమించి మరేమీ లేదని వ్యాఖ్యానించి వెళ్లిపోయారు. ఇదే కేసులో భాగంగా ఆయన మేనల్లుడు సమీర్ భుజబల్ కూడా అదే జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో 'మహారాష్ట్ర సదన్' పేరిట ప్రత్యేక భవంతిని నిర్మించిన సమయంలో ఆయన నిధుల అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News