: కార్గిల్ లో ఆర్మీపోస్టుపై విరిగిపడ్డ మంచు చరియలు!


కాశ్మీరులో మరోసారి మంచు చరియలు విరిగిపడ్డాయి. కార్గిల్ సమీపంలోని ఓ ఆర్మీపోస్టుపై మంచు కొండ విరిగిపడిన ఘటనలో జవాను అదృశ్యమయ్యాడు. సముద్ర మట్టానికి దాదాపు 17,500 అడుగుల ఎత్తున ఉన్న ఆర్మీపోస్టులో ఇద్దరు సైనికులు నిఘా విధుల్లో ఉన్న సమయంలో, స్వల్ప భూకంపం సంభవించగా, ఆ వెంటనే మంచు చరియలు విరిగిపడ్డాయి. అదృశ్యమైన జవాను ఆచూకీ కోసం సైన్యం వెతుకులాటకు ప్రతికూల వాతావరణం అడ్డంకులు సృష్టిస్తోందని తెలుస్తోంది. గత నెలలో సియాచిన్ గ్లేసియర్ లో మంచు చరియలు విరిగి పడి 10 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News