: భారత్ చేతిలో పాక్ చిత్తు... విజయం మనదే!


కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కిక్కిరిసిన క్రీడాభిమానుల సమక్షంలో ఈ సాయంకాలం ఉత్కంఠభరితంగా జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ లో దాయాది జట్టు పాక్ ను చిత్తు చేసి భారత్ ఘనవిజయం సాధించింది. అసలే పాక్ తో మ్యాచ్.. ఆపై టోర్నీలో నిలబడడానికి ఇండియాకు ఇది గెలిచి తీరాల్సిన మ్యాచ్ కావడంతో అందరి దృష్టీ ఈ మ్యాచ్ పై నిలిచింది. 119 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. 15.5 ఓవర్లలోనే సునాయాసంగా విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో అభిమానుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగిపోయింది. విరాట్ కోహ్లీ 54 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి యువరాజ్ (24), ధోనీ (13) చక్కని సహకారమందించారు. ఇండియాను విజయతీరాలకు చేర్చి, నాటౌట్ గా నిలిచిన విరాట్ కోహ్లీ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.

  • Loading...

More Telugu News