: ప్రధాని ఆఫీస్ నుంచి రఘువీరాకు ఫోన్
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి ప్రధాని కార్యాలయం (పీఎంవో) నుంచి ఫోన్ వచ్చింది. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా చేసిన చట్టంలోని అంశాలను అమలు చేయాలని, ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ పీసీసీ కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇలా సేకరించిన కోటి సంతకాలను రఘువీరా ప్రధాని కార్యాలయానికి కొరియర్ చేశారు. ఈ కొరియర్ తమకు అందిందని పీఎంవో రఘువీరాకు ఫోన్ చేసి చెప్పింది. అదే సమయంలో కొరియర్ లో ఏముందంటూ పీఎంవో ఆరాతీసింది. ప్రత్యేకహోదా కోసం ప్రజలు చేసిన కోటి సంతకాలు, మట్టి, నీరు ఉన్నాయని రఘువీరా పీఎంవోకు తెలిపారు.