: హిస్టరీ మనది...ఈడెన్ వాళ్లది...ఇంతకీ గెలుపెవరిది?
మరో గంటలో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్లు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియంకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. సాయంత్రం కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకున్నవారు టీవీలకు అతుక్కుపోయారు. అందర్లోనూ ఒకటే ఉత్కంఠ...విజేత ఎవరు? అనేది. అయితే చరిత్రను చూస్తే...ప్రపంచకప్ ఏదయినా సరే పాకిస్థాన్ జట్టుపై భారత్ ఆడేతీరు వేరు. అందుకే ఇప్పటి వరకు ఒటమి అన్నది ఎరుగలేదు. ఇకపోతే, పాకిస్థాన్ కు ఈడెన్ గార్డెన్స్ పట్టం కట్టింది. ఈ వేదికపై పాక్ జట్టు రారాజుగా వెలుగొందుతోంది. ఈడెన్ వేదికగా పాకిస్థాన్ తో ఆడిన ఏ మ్యాచ్ లోనూ భారత్ గెలిచింది లేదు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ లో ఎవరు విజేతగా నిలుస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ప్రతిష్ఠాత్మకమైన ఈ మ్యాచ్ లో విజేతగా ఎవరు నిలిస్తే వారు ఫైనల్ కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఈ మ్యాచ్ లో విజేతపై భారీ స్థాయిలో బెట్టింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.