: చిరంజీవి గురించి పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!


'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుక ప్రెస్ మీట్లో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి గురించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సినిమా షూటింగ్ సెట్ అన్నయ్య (చిరంజీవి) ఇంటికి దగ్గర్లో ఉండడంతో వచ్చి చూశారని అన్నారు. ఈ సినిమా కథ ఆయనను దృష్టిలో ఉంచుకుని తయారు చేసుకున్నానని పవన్ చెప్పారు. అన్నయ్యతో సినీ సంబంధాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. తామిద్దరం కలిసినప్పుడు పలు అంశాల గురించి చర్చించుకున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడడానికి ఇది వేదిక కాదని స్పష్టం చేశారు. ఈ సినిమా ఖమ్మం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం నేపథ్యంలో కొనసాగుతుందని తెలిపారు. అందుకే బాలీవుడ్ కు కూడా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈరోస్ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను బాలీవుడ్ లో విడుదల చేస్తుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News