: నిజాం కాలేజ్ లో నిర్వహిద్దామని అనుకున్నా...హరీష్, కేటీఆర్ లకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్


అభిమానులను ఇబ్బంది పెట్టే భద్రతా సమస్యలు తలెత్తుతున్నప్పుడు, అసలు ఆడియో వేడుక నిర్వహించడం అవసరమా? అని ఆలోచించానని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే సినీ నిర్మాతల కోరిక మేరకు, తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, డీజీపీ అనురాగ్ శర్మ, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇచ్చిన సహకారంతో ఆడియో వేడుకను హోటల్ లో నిర్వహించాలని నిర్ణయించామని చెప్పిన పవన్ కల్యాణ్, వారికి ధన్యవాదాలు తెలిపారు. తొలుత ఈ ఆడియో వేడుకను నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని భావించామని, అయితే పోలీసులు, ఇందులో అసాంఘిక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నామని పవన్ కల్యాణ్ చెప్పారు. అలాంటప్పుడు ఓ ప్రెస్ మీట్ లో ఆడియో వేడుక నిర్వహించేద్దామని కూడా సూచించానని అన్నారు. అయితే యూనిట్ సభ్యులు దానిని నిరాకరించారని, అభిమానులు బాధపడతారని సూచించారని, అభిమానులను నిరాశపరచవద్దని భావించి ఆడియో వేడుకను హోటల్ లో నిర్వహించేందుకు అంగీకరించానని పవన్ కల్యాణ్ తెలిపారు.

  • Loading...

More Telugu News