: అభిమానులూ... పాసులు లేని వారు ఫంక్షన్ కు రావద్దు: పవన్ కల్యాణ్


చాలా రోజుల తర్వాత ఈ సాయంకాలం హైదరాబాదులో పవన్ కల్యాణ్ సినిమా మీడియా ముందుకు వచ్చారు. రేపు జరుగుతున్న తన సినిమా 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుక విషయంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, ఇటీవలి కాలంలో రాజకీయ ప్రెస్ మీట్లే తప్ప సినిమా మీట్ లు పెద్దగా లేవని, సినిమా మీడియాతో దూరం పెరిగినట్టుందని భావించి ఈ ప్రెస్ మీట్ పెట్టానని పవన్ కల్యాణ్ చమత్కరించారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ఆడియో ఫంక్షన్ ను పబ్లిక్ ఫంక్షన్ గా చేస్తే కనుక భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు సందేహాలు లేవనెత్తారని పవన్ కల్యాణ్ చెప్పారు. అందుకే, ఆడియో వేడుకను హోటల్ లో నిర్వహిస్తున్నామని, ఈ ఫంక్షన్ కు పాస్ లు లేని వారు అక్కడికి రావద్దని, ఇంట్లో కూర్చుని టీవీలలో చూస్తూ ఆనందించాలని పవన్ కల్యాణ్ చెప్పారు. అభిమానులకు ఇది తన విన్నపమని ఆయన అన్నారు. వారిని ఈ నిర్ణయం ఇబ్బంది పెట్టేదే అయినప్పటికీ వారి శ్రేయస్సుకోసం ఇలా చెప్పాల్సి వస్తోందని పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News