: బాలీవుడ్‌లో మంచి పాత్రలకే ఓకే చెప్తా: కాజల్
'లక్ష్మీ కళ్యాణం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.. ఇప్పుడు మహేష్‌బాబుతో బ్రహ్మోత్సవం, పవన్‌కల్యాణ్ తో సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రాలతో బిజీబిజీగా ఉంది. దక్షిణాదిన అగ్ర నటిగా కొనసాగుతున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ కొరియన్ సినిమా రీమేక్ ‘దో లఫ్జోంకీ కహానీ’లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిన్నది బాలీవుడ్ అవకాశాలపై మాట్లాడింది. హిందీలో మంచి పాత్రలు వస్తేనే నటిస్తానని చెప్పింది. ఏదో నటించాలి కదా అనే రీతిలో కాకుండా మంచి పాత్రలు వస్తేనే డేట్స్ ఇస్తానంటోంది. లేదంటే బాలీవుడ్‌లో నటించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దక్షిణాది ప్రేక్షకులు తనను ఆదరిస్తుండటం ఎంతో ఆనందాన్నిస్తోందని, ఇక్కడ మంచి సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది.