: ఆమె పక్కా ప్రొఫెషనల్... తాప్సీకి అమితాబ్ కితాబు!


దక్షిణాదిలో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ నుంచి ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్ లో ఆమె అమితాబ్ తో 'పింక్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె గురించి అమితాబ్ ట్వీట్ చేశారు. ఆమె చాలా ప్రొఫెషనల్ అని పేర్కొన్నారు. ఇలాంటి వారిని వర్ధమాన తారలు అని అనలేమని, ప్రొఫెషనల్స్ అనాలని ఆయన పేర్కొన్నారు. రెండో సినిమా అయినప్పటికీ మంచి పరిణతితో నటిస్తోందని కితాబిచ్చారు. ఈ సినిమాలో తాను న్యాయవాది పాత్ర పోషిస్తున్నానంటూ వార్తలు రావడంపై అమితాబ్ స్పందిస్తూ, తన పాత్ర గురించి తెలుసుకోవాలంటే మరి కొంత కాలం ఆగాలని తెలిపారు.

  • Loading...

More Telugu News