: సలాహ్ అబ్దెస్లామ్ అరెస్టు ప‌ట్ల ఒబామా హ‌ర్షం


ఆమధ్య ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఐఎస్ఐఎస్ జ‌రిపిన దాడిలో కీలక నిందితుడు సలాహ్ అబ్దెస్లామ్ ప‌ట్టుబ‌డ‌డం ప‌ట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖెల్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. నిందితుడిని ప‌ట్టుకోవ‌డానికి జ‌రిపిన కృషిని ఆయ‌న అభినందించినట్టు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తెలిపింది. తమ మద్దతు ఎప్పటికీ ఆ రెండు దేశాలకు ఉంటుందని ఒబామా అన్నారు. పారిస్‌లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిలో దాదాపు 130మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News