: పెషావర్ లో నేడు సినిమాలకు బదులు క్రికెట్... టికెట్ 100 రూపాయలు
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య కోల్ కతాలో జరగనున్న టీ20 మ్యాచ్ కు పాకిస్థాన్ లో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా పాక్ లోని ప్రధాన పట్టణమైన పెషావర్ లో సినిమా హాళ్లలో షోలు రద్దు చేసి మరీ క్రికెట్ లైవ్ ఏర్పాట్లు చేసుకున్నారు. యువతను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ వీక్షణకు టికెట్ ను 100 పాక్ రూపాయలుగా నిర్ణయించారు. ధియేటర్ల బయట పోస్టర్లు, బ్యానర్లు పెట్టిమరీ ప్రచారం చేస్తున్నారు. కాగా, టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారని థియేటర్ల యజమానులు సంతోషంగా చెబుతున్నారు. కాగా, కోల్ కతాలో వర్షం కురవడం అభిమానులను ఆందోళనలోకి నెట్టింది.