: వచ్చే ఏడాది ఢిల్లీలో మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం బ్రాంచ్


ప్రముఖ వ్యక్తుల మైనపు బొమ్మల సమూహాలతో ప్రసిద్ధి చెందిన మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియం బ్రాంచిని ఢిల్లీలోనూ చూడ‌బోతున్నాం. 2017లో ఇండియా 70వ స్వాతంత్య్ర దినోత్స‌వం జ‌రుపుకోనున్న సంద‌ర్భంగా 'మేడమ్ తుస్సాడ్' నూత‌న బ్రాంచీని న్యూఢిల్లీలో ప్రారంభించ‌నున్న‌ట్లు ఆ మ్యూజియం మార్కెటింగ్ మేనేజర్ ఎలెక్స్ కామెరాన్ చెప్పారు. ఇందు కోసం వచ్చే రెండేళ్లలో తుస్పాడ్స్ 50 మిలియన్ల బ్రిటీష్ పౌండ్ల‌ను వ్యయం చేయనుందని ఆయ‌న అన్నారు. వచ్చే ఏడాది నాటికి ఢిల్లీలో ఈ మ్యాజియం బ్రాంచ్ ను ప్రారంభించాలన్నది తమ ల‌క్ష్యంగా పేర్కొన్నారు. ఇటీవ‌లే లండన్, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్‌లలోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలలో భార‌త‌ప్ర‌ధాని మోదీ మైనపు బొమ్మను ఉంచనున్నట్లు మ్యూజియం అధికారులు వెల్లడించిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News