: పవన్ కల్యాణ్ కు సలహాలిచ్చిన రాంగోపాల్ వర్మ


ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ కు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పలు సలహాలు, సూచనలు చేశాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాను బాలీవుడ్ లో విడుదల చేయడంపై పునరాలోచన చేయాలని వర్మ పవన్ కల్యాణ్ ను కోరాడు. 'బాహుబలి'ని మించిన విజువల్ వండర్స్ ఉంటే 'సర్దార్ గబ్బర్ సింగ్' ను బాలీవుడ్ లో విడుదల చేయవచ్చని సలహా ఇచ్చాడు. జాతీయ స్థాయిలో 'బాహుబలి'తో ప్రభాస్ స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడని చెప్పిన వర్మ, ఆ స్థాయిని అందుకోవాలంటే 'సర్దార్ గబ్బర్ సింగ్' లో విషయం ఉండాలని అన్నాడు. బాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కంటే ప్రభాసే గొప్ప అని చెప్పాడు. పవన్ కల్యాణ్ పక్కనున్న వారు, ఆయనను శిఖరమంత తప్పు చేయనివ్వకుండా చూడాలని వర్మ కోరాడు. 'బాహుబలి'తో పోలిస్తే 'సర్దార్ గబ్బర్ సింగ్' గొప్ప సినిమా కాదని తేల్చిచెప్పాడు. మరి దీనిపై పవన్ కల్యాణ్ ఏమంటాడో!

  • Loading...

More Telugu News