: మీకు మేమున్నాం... రైతులకు మోదీ భరోసా
ఢిల్లీలో నిర్వహిస్తున్న కృషీ ఉన్నతి మేళాను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులలో తమ ప్రభుత్వం పట్ల భరోసా నింపే ప్రయత్నం చేశారు. రైతుల కష్టాల్లో తమ ప్రభుత్వం పాలుపంచుకుంటుందని అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా అడుగువేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ సాంకేతిక సమాచారంతో ప్రయోజనాలను గురించి ప్రస్తావించిన మోదీ.. ఆ సాంకేతికత అందరికీ చేరవేస్తామని అన్నారు. తాము చేయాలనుకున్నదంతా కచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ... తాము చేసిన అభివృద్ధిని వారే చేసినట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. కొన్ని చోట్ల ప్రాజెక్టులు కట్టారు కానీ రైతులకు మాత్రం నీరందలేదని విమర్శించారు. రైతులు ఆనందంగా ఉండాలంటే వేసవిలోనూ నీరు పుష్కలంగా ఉండాలన్నారు. అలాగే, వేసవిలో నీటి పొదుపుపై అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు.