: ముంబై పోలీస్ కమీషనర్ కు ఇల్లు లేదు... మెస్ లో ఉంటున్న నగర పోలీస్ బాస్!
ముంబై పోలీస్ కమిషనరేట్ హిస్టరీలో మొదటిసారిగా ఓ పోలీస్ కమీషనర్ నెలరోజులుగా ఆఫీసర్స్ మెస్‌లోనే నివసిస్తున్నారు. సాధారణంగా ముంబై పోలీస్ కమీషనర్.. సౌత్ ముంబైలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ కు దగ్గరలోని గవర్నమెంట్ హౌజ్‌లో నివాసముంటారు. కానీ కమీషనర్ ఆఫ్ పోలీస్ దత్తారై పడ్‌సాల్‌గికర్ మాత్రం వసతి గృహం కొరత కారణంగా అక్కడి వర్లీలోని ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ మెస్ వద్ద నివసిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 31న పడ్‌సాల్‌గికర్ కు ప్రభుత్వం ముంబై నగర కమీషనర్ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ఆయన ఇదే మెస్‌లో బసచేస్తున్నారు. ప్రస్తుతం వసతి గృహాలు ఖాళీ లేకపోవడంతో ఆయనకు హౌస్ కేటాయింపు జరగలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏమైనా, ముంబై పోలీస్ బాస్ కి వసతి గృహం లేకపోవడం, ఆయన మెస్ లో నివాసముండడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.