: దోపిడి రాజ్యం!... దొంగల రాజ్యం!: జగన్ పాదయాత్రలో హోరెత్తుతున్న నినాదాలు
న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా బేఖాతరు చేస్తూ తన ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా టీడీపీ సర్కారు వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వైసీపీ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు పాదయాత్రగా బయలుదేరింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండుటెండలో ముందు నడుస్తుండగా, పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ ‘‘దోపిడి రాజ్యం... దొంగల రాజ్యం’’ అంటూ నినదిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు ముందుకు సాగుతున్నారు.