: కొనసాగిన వైసీపీ ఆందోళన... ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా
వైసీపీ ఎమ్మెల్యేల చప్పట్లు, నినాదాలతో ఏపీ అసెంబ్లీ హోరెత్తిపోయింది. విపక్ష సభ్యుల వరుస ఆందోళనల కారణంగా సభ సోమవారానికి వాయిదా పడిపోయింది. అసెంబ్లీ స్పీకర్ విధించిన ఏడాది సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తివేయడంతో సభకు వచ్చేందుకు యత్నించిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిన్న జరిగిన హైడ్రామాకు నిరసనగా నేడు నలుపు రంగు దుస్తుల్లో రావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీంతో జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా నల్ల చొక్కాల్లోనే నేటి సమావేశానికి హాజరయ్యారు. తమ సభ్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వారు వచ్చీరాగానే స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో సభను రెండు సార్లు వాయిదా వేసిన కోడెల.. ఇక వైసీపీ ఆందోళనలు సద్దుమణిగేలా లేవని భావించి సభను సోమవారానికి వాయిదా వేశారు.