: నల్ల రంగు చొక్కాల్లో జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు... చప్పట్లు కొడుతూ స్పీకర్ పోడియం ముట్టడి


వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నల్ల చొక్కా వేసుకొచ్చారు. జగన్ తో పాటు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా నల్ల రంగు చొక్కాలతోనే నేటి సమావేశాలకు హాజరయ్యారు. రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినా, ఆమెను సభలోపలికి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ నల్ల రంగు దుస్తుల్లో సభకు రావాలని నిన్ననే జగన్ నిర్ణయించారు. ఈ క్రమంలో జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలంతా నల్ల రంగు చొక్కాలేసుకుని నేటి సభకు వచ్చారు. చొక్కా నలుపు రంగుదే వేసుకున్నా, ప్యాంట్లు మాత్రం వేర్వేరు రంగులవి వేసుకుని వచ్చారు. వచ్చీరాగానే సభా కార్యకలాపాలను అడ్డుకునే క్రమంలో వారంతా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. చప్పట్లు కొడుతూ, పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సభను హోరెత్తించారు. ఈ క్రమంలో ప్రశ్నోత్తరాలను చేపట్టిన స్పీకర్ కోడెల శివప్రసాద్, విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News