: రష్యాలో కుప్పకూలిన 'ఫ్లై దుబాయ్' విమానం... 59 మంది దుర్మరణం


రష్యాలో కొద్దిసేపటి క్రితం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. రన్ వేపై దిగుతున్న ఓ విమానం దట్టమైన పొగమంచు కారణంగా కుప్పకూలిపోయింది. మరికాసేపట్లో రన్ వేపై ల్యాండు కావలసిన క్రమంలోనే విమానం కుప్పకూలడం గమనార్హం. ఈ ప్రమాదంలో సదరు విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది... మొత్తం 59 మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకెళితే... దుబాయి నుంచి రష్యా చేరుకున్న 'ఫ్లై దుబాయ్' ప్యాసెంజర్ బోయింగ్ విమానం ఎఫ్ జెడ్ 981... రష్యాలోని రొస్తోవ్ అన్ డాన్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండవుతున్న విమానం ఒక్కసారిగా రన్ వేపైనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 59 మంది చనిపోయినట్లు రష్యా అధికారులు ధ్రువీకరించారు.

  • Loading...

More Telugu News