: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్!... ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం


అగ్రిగోల్డ్ యాజమాన్యం నయామోసం కారణంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న లక్షలాది మంది డిపాజిట్ దారులకు ఏపీ కేబినెట్ నిన్న గుడ్ న్యూస్ వినిపించింది. కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిన్న హైదరాబాదులో జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ రోజూ చేపట్టడంతో పాటు సంస్థ ఆస్తులను విక్రయించి, వచ్చిన సొమ్మును బాధితులకు చెల్లించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

  • Loading...

More Telugu News