: నోకియాను వెనక్కి నెట్టేసిన శాంసంగ్


వ్యాపారంలో ఎప్పటికప్పుడు నవ్యత ఉండాలి. వినియోగదారులు ఏం కోరుకుంటున్నారో ప్రత్యర్థుల కంటే ముందుగా పసిగట్టాలి. అందుకనుగుణంగా ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయాలి. అప్పుడే ఆ కంపెనీ మార్కెట్లో పైచేయి సాధించగలదు. కానీ ఈ విషయంలో నోకియా వెనుకబడింది. వినియోగదారుల అంచనాలు, అవసరాలను గుర్తించడంలో తప్పటడుగులు వేస్తూ వస్తున్న మార్కెట్ లీడర్ నోకియాను దాటుకుని శాంసంగ్ భారత్ లో మొదటి స్థానానికి చేరుకుంది. అయితే ఇది దేశ వ్యాప్త మార్కెట్ లెక్క కాదు. దేశం మెత్తం మొబైల్ ఫోన్ల విక్రయాలలో 70 శాతం వాటా కలిగిన 793 పట్టణాలలో గణాంకాల ఆధారంగా జిఎఫ్ కె, నీల్సన్ వేసిన అంచనా.

ఈ ప్రకారం చూసినప్పుడు 31.4శాతం వాటాతో శాంసంగ్ మార్కెట్లో లీడర్ గా నిలిచింది. ఇన్నాళ్లూ లీడర్ హోదాను అనుభవిస్తున్న నోకియా 30.1శాతం వాటాతో రెండో స్థానానికి దిగజారిపోయింది. ముఖ్యంగా, శాంసంగ్ ఫీచర్, స్మార్ట్ ఫోన్లు విరివిగా అమ్ముడుపోతున్నాయి. నోకియా మాత్రం కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నా వినియోగదారులను ఆకట్టుకోలేకపోతోంది.

  • Loading...

More Telugu News