: శాసనసభా సమావేశాల తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర


తెలంగాణ శాసనసభా సమావేశాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించనున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షం, పార్లమెంటరీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చే నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆరోజు ఉదయం ప్రతినిధుల సభ, సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నామన్నారు. పార్టీ బలోపేతం కోసం శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు కడియం పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News