: మార్కెట్లో ముందున్న ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ ఇండియా!


భారత్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో 74.76 లక్షల మంది విమానయానం చేశారని గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఫివ్రవరిలో 60.16 లక్షల మంది ప్రయాణించారని లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఫిబ్రవరిలో విమానయానం 24 శాతం పెరిగింది. ఇప్పుడు అన్ని విమానాల్లోను 80 శాతం సీట్లు నిండుతున్నాయని డీజీసీఏ అధికారి ఒకరు చెప్పారు. ఇక, ఫిబ్రవరిలో జరిగిన వ్యాపారంలో 34.8 శాతం మార్కెట్ వాటాని ఇండిగో ఎయిర్ లైన్స్ కొల్లగొట్టిందని గణాంకాలు వివరించాయి. తరువాతి స్థానంలో 18.4 శాతం మార్కెట్ వాటాతో జెట్ ఎయిర్ వేస్ నిలిచింది. ఎయిర్ ఇండియా 15.4 శాతంతో, గోఎయిర్ 8 శాతం, జెట్ లైనర్ 2.8 శాతం, ఎయిర్ ఏషియా 2.2, విస్తారా 2 శాతం, ఎయిర్ కోస్టా 0.8 శాతం, ఎయిర్ పెగాసన్, ట్రూజెట్ కలిసి 0.3 శాతం మార్కెట్ వాటాని సొంతం చేసుకున్నాయని గణాంకాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News