: ప్రియుడ్ని చూసి ఆ విషయం అర్థం చేసుకున్నా: అలియా భట్


ఈ మధ్యే సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్నానని అంగీకరించిన బాలీవుడ్ అందాలభామ అలియా భట్ అతనిని చూసి కుటుంబంపై ప్రేమను పెంచుకున్నానని చెబుతోంది. తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన 'కపూర్ అండ్ సన్స్' సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ లో జోరుగా పాల్గొంటున్న అలియా పలు విషయాలు వెల్లడిస్తోంది. గతంలో తన కుటుంబానికి అంతగా ప్రాముఖ్యత ఇచ్చేదానిని కాదని చెప్పింది. ఈ మధ్యే తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపింది. సినిమాల నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పిన అలియా, సిద్ధార్థ్ మల్హోత్రా ఒంటరిగా తన పనులు తాను చేసుకోవడం చూసి కుటుంబం విలువ తెలుసుకున్నానని చెప్పింది. తన ఫ్యామిలీ తనను చూసుకున్నంత ప్రేమగా తాను వారిని చూసుకోలేదని అర్థమైందని పేర్కొంది. తన కుటుంబం సినీ రంగంలోనే ఉండడం తనకు బాగా కలిసివచ్చిందని అలియా అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News