: దేశద్రోహం కేసులో జేఎన్యూ ఇతర విద్యార్థులకు కూడా బెయిల్
దేశద్రోహం కేసును ఎదుర్కొంటూ, తీహార్ జైల్లో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులు ఉమర్ ఖలీల్, అనిల్ భట్టాచార్యలకు పాటియాలా హౌస్ కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. వీరికి ఆరు నెలల మధ్యంతర బెయిల్ ను ఇస్తున్నట్టు తెలిపింది. ఈ ఆరు నెలల్లో పోలీసుల విచారణకు అందుబాటులో ఉండాలని పేర్కొంది. కోర్టు ఉత్తర్వులను ఉమర్, అనిల్ తరఫు న్యాయవాదులు రేపు జైలు అధికారులకు అప్పగిస్తారని, ఆపై వారు విడుదల కావచ్చని తెలుస్తోంది. కాగా, ఇదే కేసులో తొలుత అరెస్టయిన విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ కు ఇటీవల బెయిల్ లభించిన సంగతి తెలిసిందే.