: మోదీ హయాంలో భారత వైభవం... 1555 లోనే జోస్యం చెప్పిన నోస్ట్రడామస్... అవునంటున్న సంఖ్యా శాస్త్రం!
అవును, మీరు చదివింది నిజమే. నరేంద్ర మోదీ హయాంలో భారత్, ప్రపంచానికే భాగ్యరేఖగా మారుతుందని ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రడామస్ జోస్యం చెప్పారట. ఈ విషయాన్ని 'అమేజింగ్ ఫ్యాక్ట్స్' పేరిట కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా ఇది సంభవమేనని అన్నారు. ఆయన ఏమని పోస్టు చేశారంటే... ప్రస్తుత లోక్ సభలో వివిధ పార్టీల సంఖ్యాబలం: బీజేపీ - 283 సీట్లు; 2+8+3 = 13 ఎన్డీయే - 337 సీట్లు; 3+3+7 = 13 యూపీఏ - 58 సీట్లు; 5+8 = 13 ఇతరులు - 148 సీట్లు; 1+4+8 = 13. "దాదాపు 450 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ ఈ విషయాన్ని అంచనా వేశాడు. 2014 నుంచి 2026 వరకూ ఓ వ్యక్తి ఇండియాకు నాయకత్వం వహిస్తారు. తొలుత ఆయన్ను ద్వేషించిన ప్రజలే, ఆపై ఆయన మీద ఎంతో ప్రేమను చూపుతారు. ఆయన దేశ దశ, దిశలను మారుస్తారు. ఓ మధ్య వయస్కుడు ఇండియాకు బంగారు భవిష్యత్తును దగ్గర చేయడంతో పాటు మొత్తం ప్రపంచానికే మార్గనిర్దేశకుడవుతారు. ఆయన నాయకత్వంలో భారత్ గ్లోబల్ మాస్టర్ గా ఎదుగుతుంది. ఎన్నో దేశాలు భారత గొడుగు కింద ఉంటాయి" అని నోస్ట్రడామస్ చెప్పినట్టు రిజిజు వ్యాఖ్యానించారు.