: మేడమ్ గారినైతే నేను అనుమతించను: జగన్ తో చీఫ్ మార్షల్


ఈరోజు అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పిన ఎమ్మెల్యే రోజాకు చుక్కెదురైన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ గేటు బయటే రోజాను మార్షల్స్ అడ్డుకున్న సందర్భంలో ఆమె వెంట వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. ఆమెను లోపలికి అనుమతించే విషయమై చీఫ్ మార్షల్ తో జగన్ గట్టిగా వాదించారు. తమను అసెంబ్లీలోకి ఎందుకు వెళ్లనివ్వరని, ఆ అధికారం ఎవరిచ్చారని జగన్ నిలదీశారు. అందుకు చీఫ్ మార్షల్ సమాధానమిస్తూ, ‘మిమ్మల్నందర్నీ లోపలికి అనుమతిస్తాను, కానీ, మేడమ్ గారు రోజాగారినైతే మాత్రం అనుమతించను’ అన్నారు. దీనికి జగన్ ప్రతిస్పందిస్తూ, ‘హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీని నిన్న అసెంబ్లీ సెక్రటరీకి సమర్పించారు. ఇంకా ఇబ్బందేమిటి?’ అని చీఫ్ మార్షల్ ను ప్రశ్నించారు. ‘నాకు పై నుంచి ఆదేశాలు లేవు.. మేడమ్ గారిని మాత్రం లోపలికి అనుమతించను’ అంటూ చీఫ్ మార్షల్ సమాధానం చెప్పారు. ఈ సంభాషణకు సంబంధించిన విజువల్స్ ను వైఎస్సార్సీపీ కాసేపటి క్రితం మీడియాకు విడుదల చేసింది.

  • Loading...

More Telugu News