: కివీస్ ఓపెనర్లు రాణించారు...ఆసీస్ బౌలర్లు ఆకట్టుకున్నారు!


టీ20 వరల్డ్ కప్ లో పటిష్ఠ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ధర్మశాలలో తొలి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండడంతో మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో క్రీజులో దిగిన గుప్తిల్ (39), విలియమ్సన్ (24) రాణించారు. గుప్తిల్ ను జేమ్స్ ఫల్కనర్ పెవిలియన్ బాటపట్టించగా... మ్యాక్స్ వెల్ వరుస ఓవర్లలో విలియమ్సన్, ఆండర్సన్ వికెట్లు తీశాడు. దీంతో నిలదొక్కుకున్నట్టు కనిపించిన మున్రో (23) అవుట్ కాగా, రాస్ టేలర్ (3) ఆడుతున్నాడు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్ వెల్ రెండు వికెట్లు తీయగా ఫాల్కనర్, మార్ష్ చెరో వికెట్ తీసి రాణించారు.

  • Loading...

More Telugu News