: మాకు తెలుసు...గెలవాలనే ఆడతాం: అశ్విన్


పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే ఒత్తిడి, అంచనాలు ఎలా ఉంటాయో తమకు తెలుసని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. కోల్ కతాలో మీడియాతో మాట్లాడుతూ, గెలవాలనే బరిలో దిగుతామని అన్నాడు. టీట్వంటీల్లో ఎవరూ ఫేవరేట్లు ఉండరని, అప్పుడు ఎవరు బాగా ఆడితే వారే మ్యాచ్ విన్నర్లు అవుతారని చెప్పాడు. పాకిస్థాన్ తో ఎలా ఆడాలో తమకు తెలుసని చెప్పాడు. గతంలో ఆ జట్టుతో చాలా మ్యాచ్ లు ఆడామని గుర్తుచేశాడు. ఆసీస్-ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్ కంటే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎక్కువ ఒత్తిడి, అంచనాలు, ఆశలు ఉంటాయని అశ్విన్ పేర్కొన్నాడు. భావోద్వేగాలను పక్కన పెట్టి మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఆడుతామని అశ్విన్ తెలిపాడు.

  • Loading...

More Telugu News