: కరాచీలో ప్రమాదకరంగా ల్యాండైన విమానం...మద్యం మత్తులో పైలట్!


పాకిస్థాన్, కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చార్టెడ్ ఫ్లయిట్ ప్రమాదకరమైన స్థితిలో ల్యాండైన సంఘటన చోటుచేసుకుంది. 18 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో రన్ వే నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం కాసేపట్లోనే వెనుదిరిగి అదే రన్ వేపై ప్రమాదకరమైన రీతిలో ల్యాండైంది. దీంతో ఇద్దరు గాయపడ్డారు. కాగా, రన్ వేపై విమానం అడ్డంగా నిలిచిపోవడంతో సీఏఏ అధికారులు విమానం వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే ఆ రన్ వేపైకి విమానాలు రాకుండా మూసివేశారు. అనంతరం పైలట్ ను పరీక్షించగా పరిమితికి మించి ఆయన మద్యం తాగినట్టు తేలింది. పైలట్ రక్తంలో ఆల్కహాల్ శాతం 0.83 వరకు ఉందని తేలింది.

  • Loading...

More Telugu News