: ‘ఆంధ్రా’లో సూరీడు భగ్గుమన్నాడు!


నవ్యాంధ్రప్రదేశ్ లో సూరీడు భగ్గుమన్నాడు. ఏపీలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల్లో ఈరోజు ఉష్ణోగ్రతలు బాగానే నమోదయ్యాయి. అనంతపురంలో 41 డిగ్రీలు, కర్నూల్, నంద్యాలలో 40 డిగ్రీలు, తిరుపతి, జంగమేశ్వరంలో 39 డిగ్రీలు, కడపలో 38 డిగ్రీలు, నెల్లూరు, ఒంగోలు, విశాఖ, నరసాపురం, కాకినాడలో 35 డిగ్రీలు, గుంటూరు జిల్లా బాపట్ల, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.

  • Loading...

More Telugu News