: బీహార్ ఎమ్మెల్యేలకు ‘బడ్జెట్’ కానుకలు!


బీహార్ ఎమ్మెల్యేలు విలువైన కానుకలు అందుకోనున్నారు. అక్కడ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ కానుకలను ఆ రాష్ట్ర విద్యాశాఖ అందించనుంది. ప్రతి శాఖ బడ్జెట్ సమావేశాలప్పుడు ఎమ్మెల్యేలకు కానుకలు అందిస్తుంది. ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తినందుకు గాను ఈ కానుకలు వారికి అందుతూ ఉంటాయి. అయితే, ఈసారి ఆ రాష్ట్ర విద్యా శాఖ వారు అందించనున్న కానుక ఏమిటంటే, మైక్రో ఓవెన్. మొత్తం 243 మంది ఎమ్మెల్యేలు ఈ కానుకను అందుకోనున్నారు. ఒక్కొక్క ఓవెన్ ధర రూ.11,125 ఉంటుందని సమాచారం. ఎమ్మెల్యేలందరికీ ఈ కానుకలు ఇవ్వడం కోసం లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని బీహార్ విద్యా శాఖ మంత్రి అశోక్ చౌదరీ పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యేలకు కానుకల విషయమై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏమీ మాట్లాడలేదు. అయితే, ఉప ముఖ్యమంతి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, ఇక్కడ ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ పేదవాళ్లేనని, కానుకలు ఇవ్వడం తప్పేమి కాదన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News