: ఇదేమి చోద్యం...రేపు స్పీకర్ నన్ను ఉరితీయమంటే తీసేస్తారా?: రోజా ప్రశ్న


కోర్టుల కంటే శాసనసభే ఎక్కువని అధికారపక్షం భావిస్తోందని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. రాజ్ భవన్ కార్యదర్శిని కలిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, రేపు స్పీకర్ తనను ఉరితీయమని ఆదేశిస్తే అలాగే చేస్తారా? అని నిలదీశారు. దేశంలోని ప్రతి పౌరుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తారని, తమకు ఎక్కడైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం కోర్టుకెళ్తారని అన్నారు. కోర్టులు ఉన్నతమైనవని భావించడం వల్లే వాటిని ఆశ్రయిస్తామని ఆమె చెప్పారు. అలాంటి కోర్టు ఇచ్చిన తీర్పును కూడా స్పీకర్ గౌరవించడం లేదని ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నేడు బ్లాక్ డేగా నిలిచిపోయిందని ఆమె అన్నారు. చీఫ్ మార్షల్ ఆఫీసర్ గణేష్ బాబు న్యాయస్థానం ఆదేశాలు పట్టించుకోకుండా టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. న్యాయవ్యవస్థకంటే శాసనసభే పెద్దదైతే...కోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున న్యాయవాదిని ఎందుకు పంపారని ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News