: నిబంధనలు ఉల్లంఘిస్తే... ఎంతటి వారైనా చర్యలు తప్పవు: వైసీపీకి బొండా హెచ్చరిక
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మరోమారు మీడియా ముందుకు వచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను సభలోపలికి అనుమతించలేదని రోడ్లపై ధర్నాకు దిగడమే కాక గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన సందర్భంగా ఆయన వైసీపీ వ్యవహార సరళిని తప్పుబట్టారు. సమస్యను పరిష్కరించుకునేందుకు అవకాశమున్న సభను వదిలేసి రోడ్లపై కూర్చుంటే న్యాయమెలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. సభా నియమ నిబంధనలను అతిక్రమించి, సభ్యుల హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారు ఎంతటి వారైనా వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరిక జారీ చేశారు.