: ఫ్లిప్ కార్ట్ సీఈఓ బిన్నీ బన్సాల్ ఈ-మెయిల్ హ్యాక్... అర కోటి డిమాండ్ చేస్తున్న హ్యాకర్లు!


ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిన్నీ బన్సాల్ ఈ-మెయిల్ ఎకౌంటును హ్యాక్ చేసిన హ్యాకర్లు 80 వేల డాలర్లు (సుమారు రూ. 50 లక్షలు) డిమాండ్ చేశారు. హ్యాక్ చేసిన సీఈఓ మెయిల్ నుంచి ఫ్లిప్ కార్ట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కు రెండు మెయిల్స్ పంపారు. వెంటనే డబ్బు తమ ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బిన్నీ బన్సాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు, రష్యాలోని సర్వర్లను వాడుకున్న హ్యాకర్లు, హాంకాంగ్, కెనడాల్లోని ఐపీ అడ్రస్ ల ద్వారా మెయిల్ ఐడీని హ్యాక్ చేశారని గుర్తించారు. కాగా, సీఎఫ్ఓ సంజయ్ బవేజాకు మార్చి 1 ఉదయం 11:33కు ఈ ఈ-మెయిల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే ఆశ్చర్యపోయిన బెవాజా, బన్సాల్ ను సంప్రదించి మెయిల్ హ్యాక్ అయినట్టు గుర్తించారు.

  • Loading...

More Telugu News