: ఓ మెట్టు దిగిన కోడెల... రోజా వివాదంపై సోమవారం చర్చ


రోజా వివాదంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓ మెట్టు దిగినట్టు కనిపిస్తోంది. వైకాపా ఎమ్మెల్యే రోజాను తిరిగి అసెంబ్లీలోకి అనుమతించాలా? వద్దా? అన్న విషయమై సోమవారం నాడు అసెంబ్లీలో చర్చ చేపడతామని స్పీకర్ కోడెల ప్రకటించారు. ఆ తరువాతే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. సభ తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయంపై సభే మరో నిర్ణయం తీసుకుంటుందని, ఈలోగా హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను అందరూ చదువుకుని రావాలని సలహా ఇచ్చారు. అంతకుముందు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రసంగిస్తూ, అసెంబ్లీ వేదికగా తీసుకున్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించలేవని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదన్నారు. హైకోర్టు ఆర్డన్ ను కించపరచాలని కూడా భావించడం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News