: ట్రంప్ ద్వేషాన్ని ప్రేమించండి... ఆయన అభ్యర్థిత్వాన్ని తిప్పికొట్టండి!: హిల్లరీ క్లింటన్
డెమోక్రాట్ల తరఫున అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీపడే దిశగా ముందంజలో ఉన్న హిల్లరీ క్లింటన్, తనకు ప్రధాన పోటీదారు అవుతారని భావిస్తున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై విరుచుకుపడ్డారు. "ట్రంప్ తదుపరి అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఎంతమాత్రమూ అంగీకరించవద్దు. ఆయన ద్వేషపూరిత వ్యాఖ్యలను ప్రేమించండి. ఆయన అభ్యర్థిత్వాన్ని తిప్పికొట్టండి. ట్రంప్ విజయం సాధిస్తే, విదేశాల ముందు అమెరికా పరువు పోతుంది. మన ఘనమైన విలువలు కుంచించుకుపోతాయి" అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, హిల్లరీ అభ్యర్థిత్వానికి అధ్యక్షుడు ఒబామా నుంచి మద్దతు లభించింది. ట్రంప్ తో పోలిస్తే హిల్లరీయే అధ్యక్ష పదవికి వన్నె తెస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ గెలవక పోవచ్చని కూడా ఒబామా అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.