: తెలంగాణకు ఎదురు దెబ్బ!... ఏపీకి ఊరట!: ఉన్నత విద్యా మండలి ఆస్తులపై ‘సుప్రీం’ సంచలన తీర్పు


సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కొద్దిసేపటి క్రితం తెలంగాణకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏపీకి ఊరట లభించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదులోని ఉన్నత విద్యా మండలి ఆస్తులు, బ్యాంకు ఖాతాలపై పూర్తి స్థాయి హక్కులు తమవేనని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదించింది. అంతేకాక హైకోర్టుకు వెళ్లి మరీ న్యాయబద్ధంగా తమ వాదన సరైనదేనని కూడా నిరూపించుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఏపీ సర్కారు... సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న ఈ వ్యాజ్యంపై ఇరు రాష్ట్రాలు పలు మార్లు వాదనలు వినిపించాయి. వాదనలు పూర్తయ్యాయని ఇదివరకే ప్రకటించిన సుప్రీంకోర్టు... కొద్దిసేపటి క్రితం తుది తీర్పు వెలువరించింది. ఇరు రాష్ట్రాలు కలిసి ఉన్న కాలంలో కొనసాగిన ఉన్నత విద్యా మండలి ఆస్తులు ఒక్క తెలంగాణకు మాత్రమే ఎలా చెందుతాయంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంతేకాక ఈ ఆస్తులు తెలంగాణవేనన్న హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఉన్నత విద్యా మండలి ఆస్తులు ఇరు రాష్ట్రాలకు చెందుతాయని ప్రకటించింది.

  • Loading...

More Telugu News