: రోజాకు ఏ శిక్ష వేసినా తక్కువే!.. రోజా లేకుంటే జగన్ మాట్లాడలేరేమో!: పీతల సుజాత ధ్వజం


సభ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అధికార పక్షానికి చెందిన మహిళా సభ్యుల ఎదురు దాడి ప్రారంభమైంది. గతంలో రోజా వ్యాఖ్యలతో సభలోనే కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే అనిత కొద్దిసేపటి క్రితం మీడియా పాయింట్ వద్ద ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మహిళా మంత్రి పీతల సుజాత వంతు వచ్చింది. సభా నాయకుడు చంద్రబాబుతో పాటు సభాధ్యక్ష స్థానంలో ఉన్న కోడెల శివప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాకు ఎంతటి శిక్ష వేసినా తక్కువేనని ఆమె అసెంబ్లీ ప్రాంగణంలో ధ్వజమెత్తారు. అయినా ఒక్క సభ్యురాలి కోసం సమావేశాలకు రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలంతా బయటే ఉండిపోవడంపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభలో రోజా లేకుంటే జగన్ మాట్లాడలేరేమోనని ఆమె ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News